కొంతమంది హీరోలు సినిమాల్లో రాణిస్తూనే వ్యాపారాల్లోనూ అడుగు పెడుతుంటారు. ఒకసారి బిజినెస్ లో సక్సెస్ అయితే ఆ తర్వాత తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మెల్లిమెల్లిగా విస్తరిస్తూ ఉంటారు. టాలీవుడ్ హీరో మహేష్ బాబు సైతం ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఏఎంబీ థియేటర్ ద్వారా ఫుల్లుగా సంపాదిస్తున్నారు. మరోవైపు నిర్మాతగా మారి సినిమాలు సైతం చేస్తూ అప్కమింగ్ హీరోలను కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు మరో వ్యాపారం లోకి సైతం అడుగుపెట్టబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది.
గేమింగ్ వ్యాపారంలోకి మహేష్ బాబు
ఆయన ప్రారంభించే వ్యాపారం కూడా గేమింగ్ రంగం కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముంబైకి చెందిన “ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్” సంస్థ షార్ట్ గన్ గేమ్స్ లో వ్యూహాత్మక పెట్టుబడిదారీగా మహేష్ బాబు చేరారు. దీంతో వ్యాపార ప్రయాణంలో మహేష్ బాబు మరో అధ్యయనాన్ని మొదలుపెట్టారు. ఈ ఒప్పందంతో షార్ట్ గన్ గేమ్స్ టేక్ టౌన్ బిజినెస్ పేరుతో ఓ యాక్షన్ అడ్వెంచర్ గేమ్ ను అభివృద్ధి చేయాలని సంస్థ భావిస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, విడుదల తేదీ లాంటి అంశాలు ఇంకా ప్రకటించే అవకాశం ఉంది. ఇక మహేష్ బాబు ఈ సంస్థలో ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టారు అనే విషయాన్ని సైతం సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం గేమింగ్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇలాంటి సమయంలో మహేష్ బాబు ఆ రంగంలో పెట్టుబడిలో పెట్టారంటే ఆయన బిజినెస్ పై ఎంత ఆసక్తి చూపిస్తున్నారో అర్థమవుతుంది.
వ్యాపారంలో భర్తకు తోడుగా నమ్రత
ఇక ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆయనకు అండగా నమ్రత వ్యాపారాలను చూసుకుంటున్నారు. మహేష్ బాబు Amb థియేటర్స్, సినిమా నిర్మాణ పనులు ఇతర వ్యాపారాలను నమ్రత సైతం చూసుకుంటున్నారు. ఇప్పుడు గేమింగ్ రంగంలోకి కూడా అడుగుపెట్టడంతో నవత బాధ్యతలు కూడా మరింత పెరిగాయని చెప్పాలి.
సరిగ్గా వాడుకుంటేనే ఫ్యూచర్
నిజానికి సినిమాల్లో చాలామంది హీరోలు డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే వచ్చిన డబ్బులను సరైన చోట ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లే భవిష్యత్తులో నిలబడగలుగుతారు. ఆ విషయంలో మహేష్ బాబును మెచ్చుకోవాల్సిందే. మహేష్ బాబు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్లమే కాకుండా సక్సెస్ కూడా అవుతున్నారు. దీంతో ఇతర హీరోలు సైతం ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబును చూసి అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ లాంటి హీరోలు సైతం థియేటర్స్ మాల్స్ వ్యాపారం లోకి అడుగుపెట్టారు.
మహేష్ బాబు అప్ కమింగ్ సినిమాలు
ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తుండగా దానికి తగ్గట్టు ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక రాజమౌళితో సినిమా అంటేనే అది పూర్తయ్యే వరకు ఏళ్లు పడుతుంది. కాబట్టి మహేష్ బాబు కూడా వారణాసి షూటింగ్ దశలో ఉండటంతో మహేష్ ఇతర సినిమాల్లో నటించకుండా కేవలం వారణాసి పైనే పూర్తి దృష్టి పెట్టారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి కానీ మహేష్ బాబు రేంజ్ మరింత పెరిగిపోయే అవకాశం ఉంది.



