హీరోలు తమ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ తో ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. ఒక్కో సినిమాలో ఒక డ్రెస్సింగ్ స్టైల్ ,హెయిర్ స్టైల్ తో కనబడుతూ ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కుర్ర హీరోగా ఉన్నప్పుడు తన స్టైల్ తో ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అప్పుడు యూత్ అంతా పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ నే చేసుకునేవాళ్ళు. అంతేకాకుండా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ నే ఫాలో అయ్యేవారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువ వైరల్ అయిన డ్రెస్సింగ్ స్టైల్ బాలు సినిమాలో ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ అనే చెప్పాలి. ఆ సినిమాలో ఆయన వేసిన ఒక ప్యాంటు గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ ప్యాంట్ ను పవన్ కళ్యాణ్ కోసం తీసుకుంది మరెవరో కాదు. ఆయన మాజీ భార్య, నటి మరియు కాస్ట్యూమ్ డిజైనర్ రేణు దేశాయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రేణూ దేశాయ్ ఆ ప్యాంట్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

బాలు ప్యాంట్ వెనుక రెండో ప్రపంచయుద్ధం కథ

ఆ ప్యాంట్ ను తాను ఇటలీలోని మిలన్ లో తీసుకున్నట్టు వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఒరిజినల్ ఆర్మీ క్లాత్ తో ప్రత్యేకంగా దానిని తయారు చేశారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అలాంటి ప్యాంట్లు కేవలం ఐదు మాత్రమే తయారు చేస్తే, అందులో ఒక దానిని స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్ హామ్ కొనుగోలు చేయగా మరొక ప్యాంటును పవన్ కళ్యాణ్ కోసం తాను ఎంతో శ్రమించి తీసుకువచ్చానని అన్నారు. అడ్వాన్స్ చెల్లించి మూడు నెలలపాటు దానికోసం వెయిట్ చేశానని.. ఆ తర్వాత డెలివరీ అయినట్టు తెలిపారు. దాని ధర కూడా అప్పట్లోనే 75వేల రూపాయలు అని చెప్పారు. దీంతో ఒక్కసారిగా యాంకర్ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.

లండన్ లో కరణ్ జోహార్ తీసుకునే మాల్ లోనే షాపింగ్

మరోవైపు తాను లండన్ లోని ఓ షాపింగ్ మాల్ లో పవన్ కళ్యాణ్ కోసం దుస్తులు తీసుకునేదానినని చెప్పారు. ఆ మాల్ లో బాలీవుడ్ నిర్మాత, కాఫీ విత్ కరణ్ జోహార్ హోస్ట్… కరోనా జోహార్ కూడా షాపింగ్ చేసే వారని అన్నారు. తాము ఇద్దరమే అందులో షాపింగ్ చేసేవాళ్లమని అన్నారు. తాను పవన్ కళ్యాణ్ కోసం అందులో డ్రెస్సులు తీసుకుంటే కరెంట్ జోహార్ హీరో షారుక్ ఖాన్ కోసం తీసుకునే వారని తెలిపారు. ప్రస్తుతం రేణూదేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యాక్టింగ్ కంటే మేకింగ్ ఇష్టం

అంతేకాకుండా తనకు మొదటి నుండి తెరపై కనిపిస్తూ హీరోయిన్ గా నటించడం కంటే కెమెరా వెనక ఉండి సినిమా మేకింగ్ లో పాల్గొనడమే ఎక్కువ ఇష్టం అని చెప్పారు. పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమాకు తాను ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసినట్టు తెలిపారు. ప్రశాంతంగా ఫామ్ హౌస్ లో గడపడం, ఆకాశాన్ని చూస్తూ ఉండిపోవడం తనకు ఇష్టమైన హాబీస్ అని తెలిపారు. అయితే విడాకుల తర్వాత ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గురించి ఇంటర్వ్యూలలో రేణు దేశాయ్ పెద్దగా మాట్లాడేవారు కాదు. ఎవరైనా అడిగినా సమాధానాన్ని దాటవేయడం లేదా నేరుగా యాంకర్ కు అలాంటి ప్రశ్నలు అడగవద్దు అని చెప్పేవారు. కానీ తాజాగా ఆమె బాలు సినిమా ప్యాంట్ గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే 2009లో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి అఖీరానందన్, ఆద్య ఇద్దరు పిల్లలు పుట్టారు. 2012లో కొన్ని కారణాలవల్ల పవన్, రేణూ దేశాయ్ విడాకులు తీసుకున్నారు. అప్పటినుండి వేరువేరుగా వీళ్ళు ఉంటున్నారు. వీళ్ల కుమారుడు అకీరా నందన్ ఓవైపు మ్యూజిక్ పై దృష్టి పెడుతూనే మరోవైపు సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.